ప్రతి పౌరుడు దేశ భక్తి కలిగి ఉండాలని, దేశాన్ని రక్షించే సైనికులను గౌరవించుకోవాలని, ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తూ స్వగ్రామం సింగారం వచ్చిన సందర్భంగా ఫిబ్రవరి 1 ఆదివారం రోజున తన స్వగృహంలో శ్రీనాథ్ ను ఆత్మీయంగా సత్కరించి యువత స్ఫూర్తిగా తీసుకోవాలనీ బాలసాహిత్య రచయిత డా.వాసరవేణి పర్శరాములు అన్నారు.
సింగారం గ్రామానికి చెందిన గనగోని శ్రీనాథ్ 2018లో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించారనీ, 2020, 2021లో డిల్లీలో రాజ్పథ్ లో పరేడ్ లో పాల్గొన్నారనీ, ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారనీ,తన ప్రతిభను చాటారనీ ,ప్రస్తుతం ఆగ్రాలో కార్పోరల్ ర్యాంకులో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారనీ, బాల్యంలో శ్రీనాథ్ కు ఓనమాలు దిద్దించాననీ, శిశ్యుడైనందుకు గర్వకారణం అన్నారు.
సత్కారంలో డా.వాసరవేణి పర్శరాములు, వాసరవేణి జ్యోతి,గన్నగోని సతీష్, వి. దేవరాజు, వి.విజయ్, జి. బంటి, వై రాజు, వి.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి