'పిల్లలు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి'

 -- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య 
 పాఠశాల పిల్లలు సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకొని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం ఆయన ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ మేళా నిర్వహించారు. పిల్లలు తయారుచేసిన సైన్స్ పరికరాలు, ప్రయోగ అంశాలను ప్రదర్శించారు. ఈ సైన్స్ మేళాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన బాలబాలికలకు ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ  శాస్త్ర పరిజ్ఞానం మనిషిని ఉన్నతునిగా చేస్తుందని, సమాజంలో రోజురోజుకు మూఢనమ్మకాలు  పెరిగిపోతున్నాయని, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ  సామాజిక మార్పు తీసుకురావాలని ఆయన కోరారు. పిల్లలు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సామాజిక స్పృహతో పాటు శాస్త్రీయ వైఖరి కలిగి ఉండాలన్నారు. సర్ సివి రామన్ తోపాటు పలువురు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, వారి గొప్పతనం గురించి వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, గోపిశెట్టి సుప్రియలు శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యతను వివరించారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలు సైన్స్ కు సంబంధించిన చక్కని పరికరాలు తయారు చేసి ప్రదర్శించారు. తర్వాత పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్,  ఉపాధ్యాయినులు మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, విద్యార్థినీ, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు