ఏ తీరుగ నిను కొలుతునమ్మా
ఏ రీతిగ నిను పిలుతునమ్మా.!
నీవులేనిదే మానవ జగత్తేలేదు
నీవులేనిదేమనిషి గతియేలేదు
చల్లని నేల తల్లివి నీవమ్మా..
చక్కని కన్న తల్లివి నీవేనమ్మా.
నిన్ను మించిన ఓర్పు లేదమ్మా
నిన్ను మించిన దయ లేదమ్మా
ప్రకృతి పచ్చదనం నీ వరప్రసాదమే కదమ్మా...!
జగత్ కళ్యాణకారివి నీవేనమ్మా....!!
చెట్టు చిగురించినా..పూవు పూసినా..
ఆకు రాలినా..కాయ కాసినా..
అదంతా నీచల్లని చూపేనమ్మా
సకల ప్రాణికోటి కి శ్వాసనీవు..
సర్వ ప్రాణులకు ఆశ నీవు..
అందరికీ జీవనయానం నీవు
అన్నిటికీ జీవిత ప్రస్థానం నీవు
పుట్టుకను ఇచ్చేది నీవే..
బ్రతుకును పంచేదీ నీవే...
కన్ను మూసాక ఇముడ్చుకొనేదీ నీ ఒడిలోనే.
నింగి వర్షించిన చాలు పరవశించి పచ్చదనమిస్తావు.
ప్రకృతి అందాలతో సింగారించుకుంటావు..
నీదేహమొక రత్నగర్భమమ్మా
మణులు ,మాణిక్యాలు నీ సిరులేనమ్మా..
మణులకోసం గనులు తవ్వినా
నీ గర్భాన్ని చీల్చి చెండాడినా..
అనుగ్రహిస్తావు..!
మా నికృష్ట చేష్టలతో..
ప్లాస్టిక్ పదార్థాలతో చెత్తా, చెదారాలతో
నిన్ను కలుషితం చేస్తున్నా మౌనంగాభరిస్తావు.!
కులమనీ,మతమనీ,వర్గమనీ..
మా మనుషులకే విభేదాలు.
ఏ భేషజం లేకుండా అందరినీ నీఅక్కున చేర్చుకుని దీవిస్తావు
ఏమిచ్చి నీఋణం తీర్చగలం?
ఎన్ని జన్మలెత్తినా తనివితీరదమ్మా నీబాంధవ్యం!
అమ్మా అవనీ..మళ్ళీ మళ్ళీ పుట్టాలి నీ కమ్మని ఒడిలోనే.!
ఓ జగజ్జననీ నీకు వేల వేల వందనాలమ్మా.....🙏🙏🙏
********
*****
ఏ రీతిగ నిను పిలుతునమ్మా.!
నీవులేనిదే మానవ జగత్తేలేదు
నీవులేనిదేమనిషి గతియేలేదు
చల్లని నేల తల్లివి నీవమ్మా..
చక్కని కన్న తల్లివి నీవేనమ్మా.
నిన్ను మించిన ఓర్పు లేదమ్మా
నిన్ను మించిన దయ లేదమ్మా
ప్రకృతి పచ్చదనం నీ వరప్రసాదమే కదమ్మా...!
జగత్ కళ్యాణకారివి నీవేనమ్మా....!!
చెట్టు చిగురించినా..పూవు పూసినా..
ఆకు రాలినా..కాయ కాసినా..
అదంతా నీచల్లని చూపేనమ్మా
సకల ప్రాణికోటి కి శ్వాసనీవు..
సర్వ ప్రాణులకు ఆశ నీవు..
అందరికీ జీవనయానం నీవు
అన్నిటికీ జీవిత ప్రస్థానం నీవు
పుట్టుకను ఇచ్చేది నీవే..
బ్రతుకును పంచేదీ నీవే...
కన్ను మూసాక ఇముడ్చుకొనేదీ నీ ఒడిలోనే.
నింగి వర్షించిన చాలు పరవశించి పచ్చదనమిస్తావు.
ప్రకృతి అందాలతో సింగారించుకుంటావు..
నీదేహమొక రత్నగర్భమమ్మా
మణులు ,మాణిక్యాలు నీ సిరులేనమ్మా..
మణులకోసం గనులు తవ్వినా
నీ గర్భాన్ని చీల్చి చెండాడినా..
అనుగ్రహిస్తావు..!
మా నికృష్ట చేష్టలతో..
ప్లాస్టిక్ పదార్థాలతో చెత్తా, చెదారాలతో
నిన్ను కలుషితం చేస్తున్నా మౌనంగాభరిస్తావు.!
కులమనీ,మతమనీ,వర్గమనీ..
మా మనుషులకే విభేదాలు.
ఏ భేషజం లేకుండా అందరినీ నీఅక్కున చేర్చుకుని దీవిస్తావు
ఏమిచ్చి నీఋణం తీర్చగలం?
ఎన్ని జన్మలెత్తినా తనివితీరదమ్మా నీబాంధవ్యం!
అమ్మా అవనీ..మళ్ళీ మళ్ళీ పుట్టాలి నీ కమ్మని ఒడిలోనే.!
ఓ జగజ్జననీ నీకు వేల వేల వందనాలమ్మా.....🙏🙏🙏
********
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి