సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము చతుర్థాశ్వాసము- 184 వ రోజు
కౌరవ సేనలను చూసి ఉత్తరకుమారుడు భీతిల్లుట
అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు. " బృహన్నలా! భీస్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవ సేన భయంకరంగా ఉంది. నేను వీరితో యుద్ధం చేయగలనా. నాకు విలు విద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రధ, దుర్ముఖ, వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుందని వచ్చాను. నీవేమో నీపాటికి రథం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో యుద్ధం చేయలేను. రథమును వెనుకకు పోనిమ్ము. ఎవరి ప్రాణములు వారికితీపి కదా. నా శరీరం వణుకుతుంది " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా ! అసంఖ్యాకంగా ఉన్న కౌరవసేనల వైపు రథం ఎందుకు నడిపిస్తాను. కొద్ది పాటి సైన్యాల రక్షణలో ఉన్న గోసమూహాల వైపు రథాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను మళ్ళిస్తాము. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్ళించి తీసుకువస్తాను అని చెప్పావు కదా ఇప్పుడు ఇలా బెదిరి పోవడం తగునా " అన్నాడు. ఉత్తరుడు " అమ్మో! గోవుల మాటలు దేవుడెరుగు. అంతఃపుర కాంతల సంతోషంతో నాకేమి పని " అన్నాడు. అర్జునుడు " అధికాదు ఉత్తరకుమారా! నీ బలం ఎదిరి బలం చూసుకుని కొంచం సేపు యుద్ధం చేసి మరలవచ్చు. కౌరవసేనలు నిన్ను ఇంకా చూడకనే మనం మరలి పోవడం యుక్తము కాదు వీరులిది మెచ్చరు " అన్నాడు అర్జునుడు. " బృహన్నలా ! సుశర్మ మనగోవులను తరలించుకు వెళ్ళాడు కనుక మా తండ్రిగారు సైన్యాలతో అతనిని ఎదిరించడానికి వెళ్ళారు. నాకు సాయంగా సైన్యం లేరు కౌరవ సైన్యామో అసంఖ్యాకం దీనిని నేను ఒంటరిగా ఎలా ఎదిరించను చెప్పు. వాళ్ళు మనలిని చూడక మునుపే రథం మళ్ళించుట మంచిది వెనుదిరుగుము " అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు " అధికాదు రాకుమారా ! ఇలా ఆవులను వదిలి వెళితే నగరిలో అప్రదిష్ట కాదా. పిరికి వాళ్ళను లోకం మెచ్చదు. నీకు సారథి లేడని సైరంధ్రి చెపితే నీకు నేను సారథిగా వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులక్లు వదిలి మరలలేను. నీకేం భయం వద్దు మనసు చిక్కపట్టుకో. కౌరవ సైన్యాలను ఏదో ఉపాయంతో ఓడించవచ్చు " అన్నాడు. ఉత్తరుడు " బృహన్నలా! నలుగురు నవ్వితే నాకేమి? నీకు ధైర్యం ఉంటే నువ్వే యుద్ధం చెయ్యి " అంటూ ధనుర్భాణాలను రథం పై వదిలి వెను తిరిగి పరుగెత్త సాగాడు. బృహన్నల కూడా ఉత్తరకుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవ సేనలు నవ్వుకున్నాయి. బృహన్నల ఉత్తరుని పట్టుకున్నాడు. ఉత్తర కుమారుని నోరు, ఎండిపోతూ ఉంది, కాళ్ళూ చేతులు గడగడ లాడుతున్నాయి, నోరు ఎండి పోయింది, మొహం వెలవెల పోయింది గొంతు పూడుకు పోయి పరిస్థితి దారుణంగా ఉంది.
ఉత్తరకుమారుని అనునయించి అర్జునుడు యుద్ధానికి సిద్ధపడుట
ఉత్తర కుమారుడు " బృహన్నలా! నీకు అనేక బహుమతులు ఇస్తాను నన్ను వదిలి పెట్టు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది ఆమెను చూడాలి " అన్నాడు. అర్జునుడు ఉత్తర కుమారుని చూసి అనునయంగా " ఉత్తర కుమారా! భయపడకుము నీవు యుద్ధం చెయ్యలేకపోతే నా రథానికి సారథిగా ఉండు. నేను కౌరవ సేనను జయించి గోవులను మరలిస్తాను " అంటూ అర్జునుడు ఉత్తర కుమారుని తీసుకుని రథం వైపు వచ్చాడు. తాను కూడా రథం ఎక్కి రధాన్ని తాము ఆయుధాలను దాచిన శ్మశానం వైపు మరలించాడు. ఇది చూసిన కౌరవసేనలు కలవర పడ్డాయి. వారికి కొన్ని అపశకునాలు గోచరించాయి. ద్రోణుడు ధైర్యంగా ఉండమని వారిని హెచ్చరించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు