బాల గేయం: - డా. ధనాశి ఉషారాణి -నూతన ప్రక్రియల రూపకర్త -తిరుపతి జిల్లా భాకరాపేట
కొమ్మిక్కి కూసావా కోయలమ్మా 
మా పాప పిలిచింది రావమ్మా 

కోయలమ్మ గొంతులో రాగాలే
మా పాప మనసులో భావాలే 

అందమైన చందమామ వెన్నెలే 
మా పాప గుండెలో  హరివిల్లులే

అక్షరాల తోటలో పరిమళాలే 
మా పాప నవ్వులో సుగంధాలే 

తుమ్మే దమ్మ గొంతులో జానపదాలే 
మా పాప గుండెలో అభినయ రాగాలే 


కామెంట్‌లు