సుప్రభాత కవిత : - బృంద
బలహీనపరచే  జ్ఞాపకాలతో 
బ్రతుకు ముందుకు సాగదు  
అణచివేస్తూ గుండెబరువును
అంగీకరించాలి వాస్తవాలు.

ఆలోచిస్తే మారవు గతాలు
చింతిస్తే తీరవు కష్టాలు 
అనుమానిస్తే పోవు ఆపదలు 
అంతా మన ప్రాప్తమే!

అన్యాయం ఆపలేము 
అవమానం మాన్పలేము 
అభియోగం అంగీకరించలేము
అబద్దం  నిరూపించలేము

లలాట లిఖితాలు జీవితాలు 
ఎంత  మేధావి మనసుకైనా
ఏ క్షణాన ఏమవుతుందో 
ఎప్పటికీ తెలియనివ్వదు విధి

పయనం ఆగిన పాదాలకు 
తెలుసు అలసిపోయాయని
గమనం ఆగిన గుండెకు తెలుసు
ఇక అవి గమ్యం చేరవని...

ఆగని కాలపు వేగానికి 
సాగని అడుగుల నడకలతో 
మూగిన చీకటి తోస్తూ...
చూపులు సారించక తప్పదు!

మాపు ముగిసే వేళ
రేపొక్కటే  మనకున్న ఆశ!

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు