ఓ మనిషీ...స్మరించుకో..!
తొలుత రాళ్ళ వర్షం...
ఆపై పూలతో అభిషేకం..!
ఆ విధి విలాసమే
విలక్షణమైనది
నిన్ను గద్దించవచ్చు...
వేయిరీతుల పరీక్షించవచ్చు
నిప్పుల ఉయ్యాలలో
నిన్ను నిద్ర పొమ్మనవచ్చు..!
కఠిన శిక్షల కారాగారంలో
నిన్ను బంధించవచ్చు
ఎదురుదెబ్బల ఉప్పెనలో
నిన్ను ముంచెత్తవచ్చు..!
అపరిమిత వేదనల
సుడిగుండంలో...
అంతులేని శ్రమల
చక్రబంధంలో...
నిన్ను విసిరేయవచ్చు...
కష్టనష్టాల పిడుగులను
నీ మస్తకంపై మోపవచ్చు..!
సమస్యల సర్పాలు విహరించే
కత్తులబోనులో నిన్ను పడవేయవచ్చు
ఆకస్మిక ప్రమాదాల అగ్నిపర్వతంపై...
దీర్ఘవ్యాధుల కంటక మార్గంపై...
నిన్ను నడిపించవచ్చు..!
నీవు స్పృశించిన
స్వర్ణం మట్టి కావచ్చు
నీవు అడుగుపెట్టిన ప్రతిచోటా
అగాధాలు ఎదురుకావచ్చు..!
కానీ ఓ మనిషీ గుర్తుంచుకో...
ఆ పరంధాముడు
నిన్ను దీవించే ముందు...
కోటి వరాల అమృతాన్ని
ప్రసాదించే ముందు...
నీ ఊహలకందని
ఉన్నత శిఖరాలపై
నిన్ను అధిష్ఠించే ముందు..!
అందని ద్రాక్షల
మధురిమను
నీకందించే ముందు...
అఖండ విజయాల
స్వర్ణ సింహాసనాన్ని
నీకు సొంతంచేసే ముందు...
నీ సహనాన్ని శోధించే
'పూర్వసంధ్య' కు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి