వన పర్వము షష్టమాశ్వాసము
*142 వ రోజు
దండకారణ్యం
శరభంగ ఆశ్రమం నుండి రాముడు దండకారణ్యం వెళ్ళాడు. గోదావరి తీరంలో లక్ష్మణుడు అన్నకు, వదినకు నిర్మించిన పర్ణశాలలో అందరూ ప్రశాంత జీవితం జరుపుతున్నారు. దశకంఠుని చెల్లెలు శూర్పణఖ రాముని చూసి మోహపరవశ అయి వారికి అపకారం చేయబోతుండగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసాడు. శూర్పణఖ పురికొల్పగా ఖరుడు, దూషణుడు అనే ఆమె సోదరులు పదునాలుగు వేల రాక్షసులతో రాముని మీదకు యుద్ధానికి వచ్చారు. రాముని చేతిలో వారంతా హతులైయ్యారు. శూర్పణఖ రావణుని కాళ్ళపై పడి రోదించింది. రావణుడు " సోదరీ! నీకు పరాభవం చేసిన వాడెవడో చెప్పు. వెంటనే వాడిని వధిస్తాను. వాడి ఆయుష్షు తీరింది " అన్నాడు. శూర్పణఖ తాను రాముని చూసిన దగ్గర నుండి ఖర దూషణులను వధించడం వరకు అంతా చెప్పింది.
మాయలేడి
రావణుడు వెంటనే గోకర్ణం వెళ్ళి మారీచుని చూసి కలిసాడు. మారీచుడు రాముని చేతిలో పరాభవం చెంది శివుని గురించి తపస్సు చేసు కుంటున్నాడు. ఒకప్పుడు రావణునికి మంత్రిగా పనిచేసిన మారీచుడు రావణుని ఆహ్వానించాడు. రావణుడు " మారీచా! రాముడనే వాడు మన ఖరదూషణులను సంహరించాడు. వాడిని పరాభవించటానికి నీవు సహకరించాలి " అన్నాడు. ఆ మాటలు విన్న మారీచుడు వణుకుతూ " యుద్ధంలో రాముని పరాక్రమం నీవు వినలేదేమో! శివుడు కూడా రాముని బాణానికి ఎదురు నిలువ లేడు. నీకు చేటు కాలం దాపురించి ఈ కార్యానికి పూనుకున్నావు. నేను రాముని చేతిలో ఓడిపోయి ఇలా శివుని గురించి తపస్సు చేస్తున్నాను " అన్నాడు. " మారీచా నా మాట వినకున్న నేను నిన్ను సంహరిస్తాను " అన్నాడు. ఇక రావణుడు వినడని తెలుసుకుని మారీచుడు రావణుని చేతిలో మరణించే కంటే ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణించడం మేలని తలిచాడు. రావణుడు " మారీచా నీవు మాయలేడి రూపం ధరించి సీతను ప్రలోభ పెట్టు. సీత ఆ లేడిని కావాలని కోరుతుంది. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో రాముడు పరితపిస్తాడు " అన్నాడు. రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో ఆశ్రమ సమీపంలో తిరుగుతున్నాడు. విధి ప్రేరితయై సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరింది. రాముడు సీత రక్షణను లక్ష్మణునుకి అందించి బంగారు లేడి కోసం వెళ్ళాడు. అందినట్లే అందుతూ ఆలేడి రాముని అడవిలో చాలా దూరం తీసుకు వెళ్ళింది. అప్పటికి రాముడు యదార్ధం గ్రహించి శరం సంధించి మారీచుని కొట్టాడు. మారీచుడు " హా సీతా, హా లక్ష్మణా " అని రాముని కంఠాన్ని అనుకరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ అరుపులు విన్న సీత " లక్ష్మణా! మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు. నీవు వెళ్ళి రక్షించు " అన్నది. లక్ష్మణుడు " అమ్మా! సీతా మా అన్నయ్య పరాక్రమ వంతుడు. భయపడకుము మా అన్నయ్య శత్రుసంహారం చేసి రాగలడు " అన్నాడు. సీతకు కోపం వచ్చింది. ఆ ఆవేశంలో లక్ష్మణుని పై అనుమానం వచ్చింది. "లక్ష్మణా! నీ తలపు అర్ధం అయింది నీకు నా మీద ఆశ ఉంది. నేను చావనైనా చస్తాను కాని నీకు దక్కను " అని కఠోరంగా పలికింది. ఆ మాటలు భరించలేని లక్ష్మణుడు విల్లంబులు పట్టుకుని రాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి