డిలీట్:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 అవకాశవాదుల రౌండప్ డిలీట్
అసంపూర్ణ శేషాలను,
అసంబద్ధ ఆలోచనలను,
ఆకాంక్షల అగ్నిహోత్రాలను,
ఇంగితం లేని మనుషులను,
ఈసునసూయల సమస్యలను,
ఉద్వేగ విషయాలను,
ఊపిరాడనివ్వడని ఒత్తిడులను,
ఊహల లోకంలో బతుకుటను,
వదలని మోహాలను,
కదలని చేతలను,
కాదనలేని మొహమాటాలను,
వద్దనలేని వడ్డనలను,
బాధ్యతలేని బంధాలను,
కనికరం లేని సంబంధాలను,
స్పందనలేని హృదయాలను,
సాహసమెరుగని నిర్భంధాలను,
జతకట్టలేని ప్రేమలను,
మిశ్రమమైన భావాలను,
నిలబడలేని సిధ్ధాంతాలను,
పాటింపబడని విలువలను,
పనికిరాని పాటవాలను,
పళ్ళికిలించే పరాచకాలను,
నిలకడలేని వాగ్దానాలను,
విషయమే లేని పోకడలను,
వింతైన వితండవాదనలను,
నమ్మకంలేని స్నేహాలను,
పొంతనలేని పరిస్థితులను,
నీళ్ళింకిన మానవత్వాలను,
ధనమే బలమను మనస్తత్వాలను,
సంస్కారం లేని చదువులను,
దేశభక్తిలేని పౌరులను
డిలీట్ చేయండి
డిలీట్ ఎలిమినేట్ ఎరాడికేట్.
కామెంట్‌లు