చిరతా - బిల్లా....
ఏ డు పెంకులు....
జోర్ బాల్....
దాగుడు మూతలు..!
ఎన్నెన్ని....బాల్యపు ఆటలు గుర్తొస్తున్నాయి
ఈ గిర గిరా తిరిగే... బొంగరాన్ని చూస్తుంటే...!
ఈ తిరుగుతున్న బొంగరం
నన్ను నా బాల్యం లోనికి తిప్పుకు పోయింది....!
కబాడ్డీ... కొక్కో...కుప్పి గంతులు...గోళి కాయలు
ఈ ఆట లన్నీ ఏవీ...
నేటి బాల్యానికి....!?
కలిమి- లేములు మరచి
ఆకలి - దప్పులుగుర్తుకు రాక.... బాల లందరూ కలిసి ఆనందించే ఆ ఆటలు...
ఈ బాల్యాని కేవీ..!?!?
ఆటలతో ఆనందము...
ఆ ఆటలతోనే ఆరోగ్యం
ఏ దీ... ఈ బాల్యానికి ?!
ఆ ఆరోగ్యం - ఆనందం అన్నీ అప్పటి మా బాల్యానికే సొంతం...!!
రేంకుల రేసులో...
కాన్వెంట్ కార్ఖానాల్లో...
బాల శ్రామికులుగా...
మారి పోయింది ....
నేటి బాల్యం....!!
అయ్యో... జీవితానికే వరమైన బాల్యం ...
శాపంగా మారిపోయింది!
ఇదేమి దు స్థి తి...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి