చెట్టు :-హయ్, పిల్లలారా! బాగున్నారా?
పిల్లలు :-హయ్ చెట్టు! బాగున్నాం, నీవెలా ఉన్నావు?
చెట్టు :- నేను బాగున్నాను కానీ, మీరు ఇటు వచ్చారేమిటి?
పిల్లలు :- మా సారు నీవల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అవేమిటో తెలుసుకుందామని వచ్చాము. చెబుతావా నీవు.
చెట్టు :-ఇగో చెప్తా వినండి. నేను చల్లని నీడనిస్తాను, నేను మంచి గాలనిస్తాను, మంచి పండ్లను ఇస్తాను, ఇంకా అన్ని జీవులకు ఆశ్రయమిస్తాను.
పిల్లలు :-అవి మాకు తెలుసు. ఇంకా మాకు పనికి వచ్చేవి ఏమిస్తావు?
చెట్టు :- నేను ఇతర జీవులకు ఆకులు, పువ్వులు, పండ్లు, కట్టెను, తేనెకూడ అనంటే లభిస్తాయి.
పిల్లలు :- ఇలాగా! ఇంకా నీవు మాకు ఏ విధంగా సహాయ పడతావు?
చెట్టు :- నా కలప గుజ్జు తోటే కాగితాలు తయారు చేస్తారు. నా బెరడులో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కట్టెను ఇస్తాను
పిల్లలు :- అవునా!
చెట్టు :- అవును నావల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నన్ను మీరు రక్షిస్తే మిమ్మల్ని నేను రక్షిస్తాను.
పిల్లలు :- తప్పకుండా మేము మిమ్ములను రక్షించుకుంటాము. నువ్వు ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు, నేను వెళ్లి వస్తాము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి