ఓరోజు త్యాగరాజస్వామి తమ ఇంటి అరుగుపై ధ్యానంలో ఉన్నారు.
నమస్కారం అనే మాట విని కనులు తెరచిన త్యాగరాజస్వామి తమ ఎదుట ఓ పెద్దాయన నిల్చుని ఉండడాన్ని చూశారు. ఆయన పక్కన భార్య. ఓ యువకుడు ఉన్నారు. వారి ముఖాలపై అలసట కనిపిస్తోంది.
వారికి నమస్కరించారు త్యాగరాజు.
మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. ఇప్పుడ రామేశ్వరం వెళ్లవలసి ఉంది. ఈరోజు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాం అన్నారు పెద్దాయన.
తప్పకుండా అంటూ వారిని లోపలికి తీసుకువెళ్ళారు త్యాగరాజు.
మనకే అన్నానికి దారి లేదు. ఈ స్థితిలో వీరికి ఎలా అన్నం పెట్టడం...సరే ఎవరి దగ్గరైనా బియ్యం తీసుకువస్తానని వెళ్ళారు త్యాగరాజస్వామి భార్య.
ఆ విషయాన్ని గమనించిన పెద్దాయన నా దగ్గర తేనె, పిండి ఉంది. మనం కలిసే తిందాం....అన్నారు.
తిన్న తర్వాత అందరూ నడుం వాల్చారు.
అతిథులతో త్యాగరాజస్వామి యాత్ర గురించి మాట్లాడారు.
గంటలు గడిచాయి.
కోయి కూసింది. అరెరె తెల్లారిందా అని లేచారు పెద్దాయన.
ఆయనతోపాటు భార్యా, యువకుడు కూడా లేచారు.
మేము కావేరీలో స్నానం చేసి అటు నుంచి రామేశ్వరానికి పోతాం అన్నారు పెద్దాయన.
వారిని సాగనంపారు త్యాగరాజు. కంటికి కనిపించేంత దూరంనరకూ వారినమే చూస్తూ నిల్చున్నారు.
అనుకోనిది. అతిథులలో పెద్దాయన ధనుర్బాణాలతో రాముడిగాను, ఆయన భార్య సీతగానూ, యువకుడు లక్ష్మణుడిగానూ కనిపించి అదృశ్యమయ్యారు.
మనోఫలకంపై ఓ మెరుపు మెరిసినట్లు అనిపించింది. పరవశంతో మైమరచిపోయి ఆనందం చెందారు.
రామా వచ్చింది నువ్వేనా నా దైవమా బహు దూరం నడిచి వస్తున్నట్లు చెప్పావు. అయినా ఆ మాట మరచి నీతో రాత్రంతా మాట్లాడి పడుకోనివ్వకుండా చేశాను కదూ....నేను పాపిని...నీకు కాళ్ళు ఒత్తకుండా మాట్లాడుతూనే ఉన్నాను. ఆకలి తీరడానికి ఆహారపదార్థాలు సమకూర్చావు. మా ఇంట ఏదీ లేదన్నది గ్రహించి మా ఆకలి తీర్చావు....అని విలపించారు త్యాగరాజస్వామి.
అప్పుడు ఆయన వసంత రాగంలో పాడిన పాటే “సీతమ్మ మాయమ్మ...”

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి