విజయనగరంలో పుట్టిన కుసుమవల్లి తాయారు పుట్టినింట సంగీత సాహిత్యాలతో పెరిగారు.తల్లిదండ్రులు తిరుపతమ్మ, ప్రొఫెసర్ హనుమంతరావుగార్లు.బాల్యం నుంచీ చిలిపితనం ఎక్కువ. అన్నల పెంపకంలో మొగరాయుడిలాగా పెరిగానని గర్వంగా గలగల నవ్వుతూ చెప్పారు.ఐస్ క్రీంకోసం టాన్సిల్స్ ఆపరేషన్ చేయగానే,," ఏదీ నా ఐస్ క్రీం?" అని డబాయించి పుచ్చుకున్న గడుగ్గాయి. లొడలొడ కబుర్లు వాగుడుకాయ అనే బిరుదులతో పెరిగిన ఆమె పెళ్లి కాగానే ఉత్తమ ఇల్లాలుగా మారి,ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతులకి వండివార్చేది.తాను దేహం చాలించేదాకా ఇంటికి పేద గొప్ప అన్న తేడా లేకుండ వడ్డించిన అన్నపూర్ణ ఆమె.ఇక మదనపల్లి లో స్వంత ఇల్లు తోట, వేసవిలో ఇంట్లో మామిడికాయలతో రకరకాల ఆవకాయలు,మాగాయ పెట్టానని చెప్పేవారు.పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి తాయారు విషయంలో నిజమైంది. ఇంటవంట ఉన్న సాహిత్య పరిమళం ఈమెకి అబ్బింది.రేడియో పిల్లల ప్రోగ్రాంలకి పాటలు,సోది రాసి పాడి అభినయం చేసేవారు.ఆమె రాసిన గొలుసుకట్టుకథ ఆనాటి బాలప్రభలో వచ్చి మంచి పేరు తెచ్చింది.ఛైల్డ్ ఆర్టిస్టు గా రేడియోనాటకాల్లో పాల్గొని బందా, నండూరి సుబ్బారావు, సి.రామ్మోహన్రావు మొదలైన రేడియో నిలయకళాకారుల మెప్పు పొందారు.ఇక తంబూర వీణ అనేక సంగీత కచ్చేరీలలో వాయించి గుర్తింపు పొందారు.
అసమాన ప్రతిభాశాలి కె.కె.తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి