తథాగతునికి కి అక్షరాంజలులు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
శరీరం ఆశాశ్వతమని
ఏది మనవెంటరాదని
ఈర్ష్యా ద్వేషాలు అభివృద్ధికి నిరోధకాలని
ప్రేమతత్వమే ముముక్షత్వమని
శాంతి అహింసలే సుఖమయ జీవితానికి సోపానాలని
చక్రవర్తి పదవిని తృణప్రాయంగా త్యజించి
సిద్ధార్థుడు యవ్వనములోనే
భార్యా పుత్రులను భోగభాగ్యాలను వదలి
సత్యాన్వేషణ చేసి
తథాగతుడని ప్రసిద్ది చెంది 'దేవుడు నీకు కోరుకున్నంత
ధనం ఇవ్వక పోవచ్చు.. కానీ
కోరుకున్నదాని కంటే
ఎక్కువమంచి గుణం ఇచ్చినప్పడు
అదే "అదృస్టంగా" భావించని'
'ఆశ దుఃఖానికి హేతువని
ఆశనుంచి విముక్తి పొందితే దుఃఖం అంతం అవుతుందని'
జీవితంలో మనం చేసే తప్పుల్ని
గమనిచేది ఇద్దరే
ఒకరు పరమాత్మఇంకొకరు అంతరాత్మ అని
అనేక సూక్తులను చెప్పి
ఆదర్శజీవితానికి మార్గాన్ని చూపి

 ' బుద్ధం శరణం గచ్ఛామి
  ధర్మం శరణం గచ్ఛామి
  సంఘం శరణం గచ్ఛామి
అని సమాజశ్రేయస్సు చేసిన తథాగతునికి
నేనందిస్తున్న అక్షరాంజలులు ...!!

(బుద్ధ జయంతి సందర్భంగా వ్రాసినది)
...............................


కామెంట్‌లు