విశ్వామిత్రుడు త్రిశంకును స్వర్గమునకు పంపుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
త్రిశంకుని శరీరముతో స్వర్గమునకు
పంపుటకు విశ్వామిత్రుడు మునులను 
యజ్ఞ ము చేయాలని ఆజ్ఞాపించాడు 
అందుకు వారంతా సమ్మతించారు 

ఆ యజ్ఞమునకై దేవతలందకి
ఆహ్వానాం పంపినాడు విశ్వామిత్రుడు 
ఆ యజ్ఞానికి దేవతలెవరు రాలెదట 
విశ్వామిత్రుడు వారిపై కోపగించాడు 

ఓ త్రిశంకుడ నా తపశక్తి ప్రభావముతో 
నిన్ను సశరీరముతో స్వర్గమంపుతాను
నీవు చేసిన తపస్సు వృధా పోదు 
నీవు సత్యంగా స్వర్గము చేరుతావు
 
వశిష్ఠుడు చెప్పిన తడవున త్రిశంకుడు 
మునులు చూడగా స్వర్గము వెళ్లినాడు 
ఇంద్రుడు దేవతలందరూ అతన్ని చూసి 
తిరిగి నీవు భూలోకము వెళ్ళమంటారు

నీవు గురూవుచే శపింపబడితివి 
స్వర్గములో ఉండుటకు నీవనర్హుడవు
తలకిందులై నీవు భూమిపై పడిపొమ్ము 
అతడు తలక్రిందులై నేలపైకి వస్తుండెను


కామెంట్‌లు