అమెరికాలో నమోదైన మొట్టమొదటి ప్రధాన బ్యాంకు దోపిడీలలో ఇది ఒకటి...1798లో ఫిలడెల్ఫియాలోని బ్యాంక్ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఈ చోరీ జరిగింది. చోరీ చేసి పట్టుబడినతని పేరు
ఐజాక్ డేవిస్ అనే కమ్మరి.
అతను బ్యాంకులోకి జొరబడి సుమారు 162,000 డాలర్లు దొంగిలించగలిగాడు. దీని విలువ నేటి కాలంలో కొన్ని మిలియన్ల డాలర్లతో సమానం. ఆ రోజుల్లో, అది నమ్మశక్యం కాని భారీ మొత్తంగా పరిగణించారు. ప్రత్యేకించి బ్యాంకులు ఇంకా అరుదుగా ఉన్న భద్రతా వ్యవస్థలు దాదాపుగా లేని సమయమది.
డేవిస్ ఎలా పట్టుబడ్డాడనేదే ఈ కథకు ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది.
చోరీకి పాల్పడిన తర్వాత అతను నిశ్శబ్దంగా అదృశ్యమై ఉంటే పట్టుబడే వాడు కాదు. కానీ అతను చేసిన తప్పిదనం, దొంగిలించిన డబ్బులో కొంత భాగాన్ని తాను దోచుకున్న అదే బ్యాంకులో తిరిగి జమ చేసే విచిత్రమైన పొరపాటు చేశాడు.
దర్యాప్తు అధికారులు అనుమానాస్పద లావాదేవీలను గమనించి, చివరికి ఆ గుర్తు పెట్టిన నోట్లతో అతని ఆచూకీని కనుగొని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరుపగా అతను మొత్తం విషయం చెప్పి కటకటాలపాలయ్యాడు.
ఒక్క అజాగ్రత్త చర్య అతని నేరాన్ని బయటపెట్టింది.
బ్యాంకులను దోచుకోవడం దాదాపు అసాధ్యమని ప్రజలు నమ్మినందున, ఈ దోపిడీ తొలినాళ్ల అమెరికాను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ ఖజానాలను, రికార్డుల నిర్వహణను, భద్రతా చర్యలను మెరుగుపరచడం ప్రారంభించాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి