కుటుంబం. : - డా ప్రతాప్ కౌటిళ్యా.
చట్టం ధర్మం విలువల పట్ల 
మాకేలేని అభ్యంతరం మీకెందుకు.!?
చట్టం ధర్మం విలువల పట్ల 
మాకు జరిగిన అన్యాయం కోసం 
మీరెందుకు పోరాడుతారు.!!!?

ఇది కుటుంబం 
ప్రజాస్వామ్యం కాదు. 
మనమంతా 
ఒక కుటుంబం.!

రాజకీయం కాదు 
రచ్చ కెక్కి ప్రచారం చేయడానికి 
ఇది ఒక కుటుంబం 
రాజకీయ పార్టీ కాదు.!!

మాకు లేని అభ్యంతరం 
మీకెందుకు 
మాకు లేని అన్యాయం 
మీకెందుకు 
మనమంతా ఒక కుటుంబం.!!?

మాకు లేని మతం 
మాకు లేని కులం 
మాకు లేని పురాణాలు 
మీకెందుకు.!!?

మాకు లేని పవిత్రత 
మాకు లేని విలువలు 
మీకెందుకు.!!?

ఇది కుటుంబం 
రాజకీయ పార్టీ కాదు.!
మనమంతా ఒక కుటుంబం!!?

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ శ్రీ కళావేదిక.

కామెంట్‌లు