ప్రవాస పద్య పరిమళం - 14: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
నేటి అంశం : నిషిద్ధాక్షరి 
నిషిద్ధం : క - ఖ - గ - ఘ 
విషయం : గడియారం ( watch ) 
ఛందస్సు : కందము 

పై అక్షరాలు క - ఖ - గ - ఘ లేకుండా కంద పద్యము


కందము:

నడువని నడిచెడి యంత్రము
సడి చేయుచు రేబవళ్లు సమయము చెప్పున్
సడలని నడవడి ఒరవడి
తడ బాటను మాటలేని దరువులు దినమున్


కామెంట్‌లు