మరుగున పడిన మగువలు 57: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 

డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
ఎల్లాప్రగడ సీతాకుమారి బాపట్లలో 9అక్టోబర్ 1914లో పుట్టారు. సర్వోదయవర్కర్ నారాయణరావు ఆమెభర్త. ఖద్దరుధారణ, నూలు వడకటం,ప్రచారంతో పాటు ఓసెంటర్ ని స్త్రీల కోసం నెలకొల్పారామె.మద్రాస్ యూనివర్శిటీ నుంచి విద్వాన్, డిప్లమా  సంస్కృత తెలుగుభాషల్లో పొందారు.1946_56దాకా సికింద్రాబాద్ కీస్ హైస్కూల్లో టీచర్ గా పనిచేశారు.1930నుంచి నిశబ్ద కాంగ్రెస్ కార్యకర్త. నిజాంరాష్ట్ర ఆంధ్ర మహిళాసభ  ప్రెసిడెంట్ గా 1934,1941లో పని చేశారు.ఆమె ఇల్లు అనాధ వితంతు ,జీవితంలో సర్వంకోల్పోయిన మగువలకి ఆశ్రయం కల్పించింది.వారి సమస్యలు తీర్చటం, పునర్వివాహం,చదివించటం లో ఆమె కృషి అమోఘం.అనాథ బాలలకి చల్లని నీడ ! హిందూముస్లిం తేడాచూపని దొడ్డ బుద్ధి.రజాకార్ మూవ్మెంట్ లో స్త్రీల సమస్యలపై దృష్టి పెట్టిన కన్నతల్లి మనసు.1935లో ఇల్లిందల సరస్వతీదేవి ,బూర్గుల అనంత లక్ష్మి, రంగమ్మా ఓబుల్ రెడ్డితో కల్సి ఆంధ్ర యువతీమండలిని నెలకొల్పారు.ఇందిరా సేవా సదన్, కస్తూర్బా గాంధీ ట్రస్ట్,ఆంధ్ర సోదరీ సమాజంలో చురుకైన పాత్ర పోషించారు.1928 లో దసరా సంబరాల్లో యువత ని ఉద్దేశించి జోష్ గా తన ఉపన్యాసాలతో జలపాతం మోతతో సభను రంజింపచేయటం ఆమెకే సాధ్యం.ఇదే ఆమె తొలి ఉపన్యాసం హోరు! అంత ధైర్యంగా మాటలు దొర్లించిన సీతాకుమారి అందరిచేత శభాష్ అనిపించుకొన్నారు.1929లో కస్తూర్బా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రేమ్ థియేటర్ లో ఆమె తో మమేకమైన మగువలలో ఆమె ఒకరు.1930లో హరిజన్ న్యూస్ పేపర్ సైక్లోస్టైల్ చేసినవి భర్త తో కల్సి పంచారామె.నిజాం హెచ్చరికను లక్ష్యపెట్టక తమ పనులు చేసేవారా దంపతులు.
రజాకార్ల, నిజాంపోలీసుల అత్యాచారాలకు బలైన స్త్రీలున్న ప్రాంతాల కు వెళ్లి ఓదార్చి తగిన సాయం చేసిందామె. 1947_49లో రజాకార్ల బలం ఉన్న ప్రాంతాల్లో  పర్యటించి హిందూ ముస్లిం లకు ఆశ్రయం కల్పించిన ఉదారహృదయం  ఆమెది!ఆమె గొప్ప రచయిత్రి.ఎన్నో రచనలు  గోల్కొండ పత్రికలో వచ్చాయి.బాన్స్ వాడ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఎ.గా తొలి విశాలాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన  వనిత. సంజీవరెడ్డి ప్రభుత్వం కాలమది.మహిళల కోసం ఆమె ఎన్నో పథకాలు ఉపాధి రూపొందించారు.అంబర్ చరఖా,పాలు,కూరలు అమ్మకాలకు చేయూత నిచ్చారు.తన ఇంట్లోనే ప్రమదామండలిని ఏర్పాటుచేసి వయోజనవిద్య వ్యాప్తి చేశారు.21 జనవరి 1986 లో ఆమె తుదిశ్వాస విడిచారు🌷
కామెంట్‌లు
Popular posts