ఆశా కిరణం !!! : - యెనుముల వేణుగోపాలరావు అమలాపురం .

 బూరి బుగ్గల బుడతడు ,
పాల బుగ్గల పోరడు ,
భయమెరుగని బాలుడు ,
బంతిని నిర్ధాక్షణ్యంగా బాదేస్తాడు !
అందరి రికార్డులకు బొంద పెడతాడు !
అలవోకగా వంద పరుగులు కొడతాడు !
అతడు బౌలర్లకు సింహ స్వప్నం అవుతాడు!
అతగాడే బీహారు బుల్లోడు !!
ఆతని పేరే వైభవ్ సూర్య వంశీ !
ఈ ఐ పి ఎల్ సీజనుకు కొత్త వైభవం తెచ్చాడు !
అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ దేశానికి తెచ్చి పెట్టాడు !
క్రికెట్ అభిమానుల మనస్సులు కొల్ల గొట్టాడు !
భారత సెలక్టర్లకు సవాలు విసిరాడు !
అతడు భారత క్రికెట్ జట్టుకు ఆశా కిరణం!
కోరుకుందాం విజయవంతం కావాలని కోరుకుందాం అతని ప్రయాణం !!!!
               **********
కామెంట్‌లు