రంగుల్ని కలిపిన కుంచె
ఆకాశమయ్యింది
కన్నుల్ని కలిపిన చూపు
మహాసముద్రం అయింది.
పచ్చని అడవి
పచ్చని మైదానం
వెచ్చని సూర్యుడు
భూలోక స్వర్గం.
పారే నది
చల్లని చెలిమే
చేప పిల్ల
చల్లని తల్లి.
అందమైన నది
ఆనందమైన మది
అది
జగతి శృతి.
అదృశ్య గాలి
చాచిన చేతులు
పరవశ పరిమళం
అది గంధపువనం.
కరిగిన నీడ
మెరిసిన జాడ
పాలు నీళ్లు
చీకటి వెలుగులు
అది కొలువుతీరిన తీరం.
గుడి గంట
సుడిగాలి
నడిసంద్రం
జెడి వాన
నడి మధ్యన నావా
యవ్వన మువ్వలు.
వాలిన మేఘాలు
కూలిన ఆకాశం
రాలిన పూలు
పేలిన రాళ్లు
అవి జవరాళ్ళూ
జగతికి రెండు కళ్ళు.
మల్లెలు మందారాలు
మొగలి మోదుగ పూలు
భూలోక నక్షత్రాలు....!!
===============================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి