***
"ఏంది శెల్లే! మాంచి తీర్ బార్గ వొచ్చినవ్. ఏవఁన్న ముచ్చెటి వుందా?"
"ఎప్పుడు ఏదోటి శెప్పుడు, నిన్ను అడ్గుడు. ఒకోపాలి అవ్వనేమన్న యిసిగిచ్చి శికాకు శేత్తన్నా ఏంది అన్పిత్తుంది.గందుకే గియ్యాల ఊకెనే నీతాన జెర సేపు కూసోని పోదమని వొచ్చినవ్వా!"
"శెల్లే! ఎన్నడన్న నిన్ను యిస్రుకున్ననా? కస్రుకున్ననా శెప్పు. నూగాని, ఇంకెవలన్న గని అడ్గితే నా మీన గురి మరియాద కొద్ది అడిగిర్రని సంబురంగుంటది.ఏదో గింత మాట సాయం, తోశిన మంచి శెప్పడం గదేమన్న బండలెత్తుకుంటున్నా? బర్వులెత్తుకుంటున్నా శెప్పు శెల్లే! ఇంకో త్యేప గిస్మంటి యిశారం ఎప్పుడు శెయ్యబాకు."
"గట్లనే అవ్వా! నీ మన్సు నాకు తెల్వదా ఏంది? అగ్గో మొన్న ఎన్కింటి ఎంకటమ్మ మూతి మూడొంకల తిప్పుకుంట గామేమో గుర్వు గీమేమొ బల్లె పోరి లెక్క ఏందో అడ్గుత నని పొద్దత్తమానం పోతదని" నాకినబడాలని లాశిగ పక్కనున్న పార్తమ్మతో అంటుంటే శెవులార యిన్న అవ్వా! మస్తు బాదయింది.గప్పన్నించి మన్సుల ఒకటే మెరమెర. అవ్వని యిసిగిత్తున్ననా ఏందని. ఏజ్జర్గినా నీకు శెప్పకపోతే మన్సాగదవ్వా!"
"శెల్లే! ఎందుకంత యిదైతవ్. లోకం కాకుల్లాంటిదని మా అవ్వ శిన్నప్పుడు శెప్పేది. గట్ల వొర్రేటోళ్ళు వొర్రతనే ఉంటరు.గవన్ని మన్సుల పెట్టుకోవద్దు. పతోళ్ల తాన శిన్నదో పెద్దదో లోపముంటది శెల్లే! గయ్యన్ని పట్టిచ్చుకుంటే బత్కలేం ''అన్నోడు బాగనే ఉంటడు- ఇన్నోడు బాగనే ఉంటడు పడ్డోడికి పగలు రాత్రి మనియాది ఉంటది. గందుకే. గయ్యన్ని వొదిలెయ్యాలే. గవీటి వల్ల ఏవఁన్న ఫాయిదా ఉందా శెప్పు.
" అవునవ్వా! నిజవేఁ గని నా జోలి గామెకెందుకు? గామెని ఎన్నడన్న నల్లన్ననా? తెల్లన్ననా?" ఊకున్నోళ్ళమీద బట్ట గాల్చి ఏత్తరు. ఏం మడ్సులో ఏమో? "
" శెల్లే! పతోల్లకి ఏదోక లోపముంటదని శెప్పినగద! కొన్ని సూత్తూ పోవాలె, కొన్ని యిని వొదిలెయ్యాలె. ఇంకొన్ని మంచైతే నేర్సుకోవాలె. గంతే శెల్లే! "
" అవ్వా! పతోళ్లకి లోపమంంటె గీ లోకంల ఇంగ మంచోళ్ళు అన్నోల్లే లేరా ఏంది? "
"ఎందుకు లేరు శెల్లే ఉండ్రు. ఇద్దరే ఇద్దరు మంచోళ్ళు ఉండ్రు శెల్లే! "
" గీ పెపంచకం మొత్తాన యిద్దరే మంచోళ్ళుర్రా? ఎవలాళ్ళు అవ్వా? గాళ్ళు నిజ్జంగా దేవుల్లే . గాళ్లెవలో శెప్పవ్వా!"
" గాళ్ళా? గాళ్ళే ఒకడు పుట్టనోడు, ఇంకోడు గిట్టినోడు శెల్లే. పుట్టనోడు ఎస్మంటోడో తెల్వదు.గాడెవడికన్న నట్టం కట్టం కల్గిత్తడా లేదు గద గంద్కనే గాడు మంచోడన్న మాట."
" ఇంగ రెండోడు గిట్టినోడు.గిట్టినోడంటె తెల్సుగద సచ్చినోడు. గాడు బత్కున్నప్పుడు మంచో శెడో ఏం జేసినా సచ్చినంక జెయ్యలేడు గద.గందుకే గానంత మంచోడు లేడన్న మాట."
" బలేగ శెప్పినవవ్వా! గీ లోకంల పుట్టినోడు ఎంత మంచోడైనా ఏదోక లోపముంటది గని,పుట్టనోడి,సచ్చినోడికి ఇంగ ఇంగేం లోపముంటది.నువ్వన్నది నిజవేఁ అవ్వా! ఇగ్గో గిస్మంటి ముచ్చెట్లు, లోకం పోబడి తెలుత్తదనే నీ తానికి వొత్తా? ఎవలనుకుంటే నాకేంది. ఏన్గు బోతుంటే కుక్కలు మొర్గవా? గది గిట్లనే అన్కుంట అవ్వా! గిట్ల మంచి శెబర ఎవలు శెప్తరు జెప్పు."
ఓ శెల్లె బంగారం! నన్ను ముల్క శెట్టు ఎక్కియ్యకే తల్లీ! నీకు పున్నెముంటది."
గదేం లేదవ్వ! నీ యిష్యం శెప్తె నాకె మంచిగుంటది. గింత మంచిగ శిలక్కి జెప్పినట్టు ఎవలు శెప్తరు జెప్పు. "
" గదండీ సంగతీ! ఇద్దరే మంచోళ్ళు -పుట్టనోడు గిట్టినోడు" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి