సెల్లుఫోను వాడకం: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-ZPHS:బక్రిచెప్యాల-9704865816


రంగు రంగుల సెల్లుఫోను 
రమ్మని నిను పిలుచురా 
మితముగాను వాడుకొనిన 
హితను నీకు కలుగురా 

ఉదయము నిద్రనులేచి 
సెల్లు ఫోను పట్టకు
ఆరోగ్యం చెడిపోయి
ఊబకాయమొచ్చును

చెరవాణిని చెవుల బెట్టి 
బండి నేమో నడపకు 
క్షణము అదుపు దప్పిన 
ప్రాణాలకు ముప్పురా !

రోజు విడువకుండ చూస్తే 
కళ్ళు మబ్బు గమ్మురా 
కళ్ళజోడు వచ్చినా 
చదువుల వెనుకేనురా 

పెద్ద పెద్ద శబ్దాలతో
పాటలు లన్ని వినకురా
చెవులకు చెవుడొచ్చను
చెవిటి వాడివవ్వుతావు

రాత్రి ఫోను చూడకు 
ఆరోగ్యం పాడగును 
సమయానికి నిద్ర పోగ 
సర్వమునీ స్వంతమౌను

పుస్తకాల బ్యాగులల్లో
సెల్లుఫోను దాచుకొనగా
గురువుమాట గుడ్డిదాయె
గర్తుపట్టే శక్తితగ్గె

పరుగులు తీసేపాదాలుఆగే
ఆటస్థలాలువెలవెలపోయెను
స్నేహితులతో ఆటలుమానాం
సెల్లుఫోనులోమునిగిపోయాం 
 
అమ్మమ్మ కథలు తగ్గెపోయె
పురాణకథలు అటుకులెక్కె
చరవాణి చంకనెక్కగ
సంస్కృతివిలువలుదూరమయ్యెను

చరవాణి మంచిదే 
సరిగా నీవు వాడితే 
అతి చేస్తే కష్టమురా 
మితమును పాటించురా

కామెంట్‌లు