40వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సీతారామలక్ష్మణులు తల్లిదండ్రులకు నమస్కరించుట 
-------------------



సీతారామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవకు
దూరమగుచున్నందులకు దీనులై 
తండ్రిపాదములకు వందనమొనర్చిరి
శ్రీరాముడు సీతతో గూడి కౌసల్యాదేవి 
పాదములకు ప్రణవిల్లినాడు

లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించి 
కన్నతల్లి సుమిత్ర పాదములపై పడెను 
సుమిత్ర  ప్రేమాశ్రువులను రాల్చుచు 
అతనితో హితోక్తులు పలుకును 

కుమారా!లక్ష్మణా! శ్రీరామునియందు 
నీవు భక్తిశ్రద్ధలతో యుండుము 
ఓ పుణ్యాత్ముడా! ఆపదల నందు 
సంపదల నందు శ్రీరాముని అనుసరించు 

పుత్రా! శ్రీరాముని నీతండ్రి దశరథునిగా భావింపుము
సీతాదేవిని నీతల్లిగా తలంపుము 
అడవిని అయోధ్యగా భావింపుము
లక్ష్మణా! నీవు హాయిగా వెళ్లి రమ్ము.

సుమంత్రుడు శ్రీరాముని చెంతకుచేరి 
సుప్రసిద్ధమైన శ్రీరామా! నీకు జయము కలుగు 
త్వరగా రథమును అధిరోహింపుము 
నీ ఆజ్ఞనుసారము తగిన ప్రదేశమునకు చేర్చెదను 

కామెంట్‌లు