సుతునియెడబాటునకు తట్టుకొనలేక విలపించుచున్న కౌసల్యాదేవి
పదేపదే వణుకుతూ ప్రాణాలు బిగపట్టుకొని
సీతారామ లక్ష్మణులను తలచుకుంటూ
ఆ రాజమాత! సారథితో ఇలా అంటుంది
"ఓ సుమంత్రా! సీతారామ లక్ష్మణులను
చూడకుండా క్షణము జీవించలేను
వారు ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చుము
వారు నా ఎదుట లేనిచో మరణించెదను
" ఓ దేవి! శ్రీరాముని పై దిగులు వద్దు
వారు వనమున ప్రశాంతంగా యున్నారు
ఓ తల్లి! దుఃఖమును త్యజింపుము
ఆయనకై ఏమాత్రము పరితపించకు
జితేంద్రుయుడును ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు
శ్రీరామునకు రక్షణగా యున్నాడు
సీతాదేవి ఎల్లప్పుడూ తన మనసును
శ్రీరాముని యందు లగ్నమొనర్చుచున్నది
సీతాదేవి వనవాసమున దైన్యస్థితిలో లేదు
వారి వలన ఆమె నిశ్చితంగా నున్నది
వనమున హాయిగా సంచరించుచున్నది
సుమంత్రుడు కౌసల్యాదేవితో ఇలా పలికెను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి