తెలివి మెండు గుండురా
గడ్డి పోసలన్ని తెచ్చి
గూడు కట్టుకొనునురా!
గూటిలోన గుడ్లురా
పెట్టి పొదుగుచుండగా
కొన్నాళ్లకు ఆ గుడ్లే
పిల్లలగును చూడరా!
చెట్టు చేమలన్ని దిరిగి
ఆహారము తెచ్చురా
పిల్లల నోటికందినంత
ఆకలంత తీరునురా!
గూటిలోని పిల్లలు
తల్లిని గమనించురా
తల్లి బాటలోనే అవియు
స్వేచ్ఛగా విహరించురా!
సృష్టిలోని మూగ జీవి
తన కాళ్లపై తానురా
బతికిచెప్పు గొప్పనీతి
తెలుసుకొనిన కలుగు జయం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి