తాబేలు మా ముత్తాత.
అది మా ఆస్తి
అది వాళ్ళ అస్తిపంజరం
అది వాళ్ళ అస్తిత్వం
అది వాళ్ళ సజీవ రక్తం మాంసం.
అది ఒక సజీవ సమాధి.!!?
అది
సముద్ర తుఫానులను
సుడిగుండాలను ఎన్నో చూసింది.
అది
భూమిపై ఎన్నో భూకంపాలను
విధ్వంసాలను తట్టుకొని నిలబడింది
అది
ఎన్నో సామ్రాజ్యాలను
రాజ్యాలను
నేలకొరిగిన రాజులను రాణులను
అంతఃపురాలను
ఎన్నో శిథిలమైన కోటలను
కూలిన కట్టడాలను చూసిందీ.
తాబేలు మా తాత
తాబేలు మా ముత్తాత
అది ఒక సజీవ సమాధి.!!
=====================
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి