సంధ్య వాలితే ... : - కోరాడ నరసింహా రావు

 

సంధ్య వాలితే ... 
  ఇంటింట, వీధి,వాడా
  ఉరంతా... మనం దీపాలు వెలిగించుకోవల  సిందే... 
  లేకుంటే అంతా అంధకార బంధురమే...! 

ఇది తొలి సంధ్య వేకువ దీపం... 
  ఈ జగతి కోసం... 
 జ్వాజ్వల్యమానంగా... 
  దినకరుడు స్వయం ప్రకాసియైన అద్భుత దీ పం...! 
కేవలం ఈ ఒక్క దీపమే 
 ఇటు మనకు... 
  అటు వారికి వెలుగులను పంచే అద్భుత దీపం...!! 

కాలాన్ని తెలియ జేసి... 
  మనలను నడిపించే
 దినకర దీపం...! 

ఆదిత్యాయ నమోన్నమః... 💐🙏🌷🙏💐
అనటం తప్ప ఏమిచ్చి ఆ రుణా న్ని తీర్చుకోగలం....!! 
    ******

కామెంట్‌లు