అంతర్జాలంగా " అరుణ తోరణాలు " పుస్తక పరిచయం వేదికలో మంగళవారం సాయంత్రం బలుసాని వనజ ప్రార్థనా గీతంతో మొదలై అయ్యల సోమయాజుల ప్రసాద్ గారి వేద ఆశి ర్వచనాలతో ప్రారంభమయ్యింది.తదుపరి రచయిత్ర ,నిర్వాహకురాలు కోదాటి అరుణ తొలి పలుకులుగా అతిథులును స్వాగతించారు.సభాద్యక్షులు రామక్రష్ణ చంద్రమౌళి సభను నిర్వహిస్తూ ముందుగా ఆచార్య టి. గౌరీశంకర్ ను స్వాగతిoచగా. గౌరీశంకర్ గారు అరుణ అంటే ఎరుపు అని వివరిస్తూ ఆ సంచికలోని అమ్మ, నాన్న , కవితలు వివరిస్తూ కవితా శైలి ఇంకొంచెం బాగుండాలి అని చెప్పారు.
తరువాత సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.కె.వి.కృష్ణకుమారి గారిని ఆహ్వానించగా ఆమె కొన్ని కవితలను వివరిస్తూ అరుణ కవితలను అనుభవిస్తూ , ఆనందిస్తూ తపనతో రాసింది అని, ఆధ్యాత్మికతసామాజిక సేవ కలిగిన అరుణ ఎంతో సహృదుయు రాలని పేర్కొనింది. నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తున్న అరుణ లాంటి వారు నేటి కాలంలో చాలా అరుదని చెప్పింది. ఆప్యాయంగా అక్కా అని పలుకరించే అరుణ చెల్లెమ్మ అంటే తనకెంతో ఇష్టం అని, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించింది.
తదుపరి డా జయరాములు గారు మాట్లాడుతూ అరుణతోరణాలు కవితా సంపుటిలోని అధ్యాత్మిక కవితల గురించి విశ్లేషించారు. అరుణ అధ్యాత్మికoగా హరిహర శంకర కవిత, అమ్మవారి కవితలో దేవుళ్ళను నిలదీస్తున్నట్టు రాయడం ఆవేదనగా రాసిందని చెప్పారు.
తదుపరి అధ్యక్షులు డా. వి.డి. రాజగోపాల్ గారిని ఆహ్వానిo చగా అతను రైతు , సైనికుల దేశభక్తి కవితలను ఎంచుకుని కాళ్లకు చెప్పులు లేకుండా రైతుతనబిడ్డలకు బూట్లు కొని కాన్వెంట్ చదువులకు పంపుతున్నాడని వివరించారు. రైతు కష్టాలు పల్లెటూరులో ప్రత్యక్ష్యo గా చూచిరాసినట్టుంది అన్నారు.
అందరూ కూడా కవితలను విశ్లేషంచడమే కాకుండా రచయిత్రి అరుణకు తగుసలహాలు కూడా ఇచ్చారు. అవి తనను తాను మలుచు కోవడానికి ఎంతో ఉపయోగ పడ తాయని అరుణ సంతోష పడింది.
తదనంతరం సభాధ్యక్షులు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారిని పరిచయం చేసి అరుణ గారి పుస్తకాన్ని పరిచయం చేయమని కోరారు. రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ అరుణ తోరణాలు అనే శీర్షికనే అందరినీ ఆకర్షిస్తుందని, తోరణం అంటే ఆహవానమని, అరుణ అంటే ఉదయ కాంతి అని, అక్షరాలతో అల్లిన ఈ తోరణాలు పాఠకులను సరికొత్త ఆలోచనల ప్రపంచం లోనికి ఆహ్వానిస్తాయన్నారు. పుస్తకంలోని ప్రతి కవిత ఒక తోరణం, ప్రతి భావం ఒక పుష్పం, ప్రతి సందేశం ఒక పరిమళం అన్నారు. అరుణ గారు కేవలం భావకురాలే కాదు, చైతన్యవంతురాలు, గృహిణీ, సున్నిత హృదయ్యురాలు, భారతీయురాలు మరియు ప్రకృతి ప్రేమికురాలు అని అన్నారు. కవితలలో ప్రధానంగా కనిపించే కుటుంబ విలువలు, సమాజ చైతన్యం, జీవనతత్వం, ప్రకృతి - పర్యావరణం మరియు ఆధ్యాత్మికత గురించి వివరించారు.తర్వాత అరుణ గారి రచనా శైలి గురించి, ముఖ్యమైన మూడు లక్షణాలను తెలియజేశారు. రచయిత్రి ఉపాధ్యాయురాలుగా, రేడియో రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, సాహిత్య కార్యక్రమ నిర్వాహకురాలుగా కలిగిన అనుభవాలు ఆమే కవితల్లో ప్రతిబింబించాయని అన్నారు. అరుణ గారి పది కవితల్లోని పది హృద్యమైన కవితా పంక్తులను చదివి వినిపించారు. అరుణ తోరణాలు కేవలం కవితా సంపుటి మాత్రమే కాదు, అది కుటుంబ విలువల పాఠశాల, మానవతకు మార్గదర్శి, సామాజిక చైతన్యానికి ఆహ్వానం, ప్రకృతి ప్రేమకు ప్రతీక అని చెప్పి, అరుణ గారిని అభినందించి, ఆమె కలంనుండి మరెన్నో సంపుటాలు వెలువడాలని ఆకాంక్షించారు.
తదుపరి విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ లింగాల క్రిష్ణారెడ్డి గారు అరుణ గారి అనుభూతులు పుస్తకంలో కవితా రూపాలుగా చక్కగా వెలువడ్డాయని అన్నారు. కావలి కవి, నటుడు శ్రీ రామాయణం ప్రసాదరావు గారు అరుణ గారి కవితా చాతుర్యం తన పుస్తకంలో ప్రదర్శించారని కొనియాడారు. ఒంగోలు కవి, విశ్రాంత బ్యాంకు అధికారి ఉప్పలపాటి వెంకటరత్నం గారు మంచి కవితల పుస్తకాన్ని సాహిత్య లోకానికి అందించినందుకు అభినందనలు తెలిపారు. మరో ఒంగోలు కవి బంతికట్ల నాగేశ్వరరెడ్డి గారు ఓ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తపరిచారు.
గౌరి గారు, రాణిరెడ్డి గారు, సత్యబాల గారు, ఉపద్రష్ట శ్రీలక్ష్మి గారు, అవధానం అమృతవల్లిగారి కోదాటి అరుణ గారికి అభినందనలు తెలిపారు
కథలు నాటికల గురించి వివరించారు.
ముందుమాట రాసిన చిటికెన కిరణ్ కుమార్ అమ్మ, నాన్న కవితలను మరికొన్ని కవితా వాక్యాలు నచ్చిన వి అంటూ వివరించారు
ముందు మాట రాసిన ఘంటా మనోహర్ రెడ్డి గారు యాత్రల టూర్ లో ఉండి రాలేకపోతున్నాను అంటూ అభినందనలు తెలిపారు.
. సి. నారాయణ స్వామి గారు అద్భుతంగా, కవితాత్మకంగా సభా కార్యక్రమాలను తెలియజేసారు.
బడేసాహెబ్ గారు మాట్లాడుతూ సాహిత్య అభివృద్ధి కొరకు ఇంకా కృషి చేయడానికి సహకరించాలని అన్నారు.
కల్లేష్ గారు
యువత కొరకు రచనలు, కార్యక్రమాలు చేయాలనీ వివరించారు
రంగరాజు పద్మజ గారు అరుణా క్షర తోరణాల్లోని ఇల్లు , అంటే అలిసిపోయి వచ్చిన వారికీ హాయిగొలపే నివాసమని వాక్యాలు చక్కగా ఉన్నాయన్నారు. మరికొన్ని కవితలు విశ్లేషంచారు.వీరే గాక బుక్కపట్నం రమాదేవి గారు, శోభ దేశపాండె గారు, గొర్రెపాటి శ్రీను , పరుచూరి నాగేంద్రమ్మ గారు, , కర్నా రామిరెడ్డి గారు, డాక్టర్ కల్లేష్ గారుజయప్రకాష్గారు,, జగన్ గారు, లలితకుమారి గారు, మంజుల రాణి గారు, నులక వరలక్ష్మి గారు, కాంచనపల్లి గోవర్ధన్ గారు, విక్టొరియా అద్దూరి గారు పాల్గొని సభకు వన్నెతెచ్చారు. కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు అందరూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
రచయిత్రి అరుణ గారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సి. నారాయణస్వామి గారి వందన సమర్పణతో మూడు గంటల కార్యక్రమం ముగిసింది.38 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం దిగ్విజయం గా ముగిసింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి