వారు గంగానదితీరమునగల శృంగబేరికి చేరుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ఆ పవిత్ర గంగానది సమీపమున చూడగా 
ఋషులఆశ్రమములు యుండును 
ఆ నదితీరమున స్నాన ఘట్టములలో
అప్సరసలు జలక్రీడలు సలుపెదెరు 

ఆ నది తీరమున దేవతలు విహరించెదరు. 
అనువుగా చక్కని క్రీడాపర్వతములు 
రమ్యమైన ఉద్యానవనములు 
ఆ నది దివ్యపద్మములతో విలసిల్లు చుండెను 

దేవతల కొరకై ఆకాశమున ప్రవహించే 
"ఆకాశగంగ" గా ఆ గంగ వాసిగాంచెను 
ఆ గంగానదిజలపాతముల శబ్దములు
మిక్కిలి భయము గొలుపుచుండెను

ఆ నది కొన్నిచోట్ల గంభీరముగా 
కొన్నిచోట్ల ఉవెత్తుతరంగములతో 
వేగముగను ప్రవహించుచుండెను 
ఆ నదితరంగధ్వనులు మృదంగనాదములను 

తలపింపచేయుచూ ప్రవహించును 
కొన్నిచోట్ల ఆ నది పిడుగులు పడినట్లు 
భయంకరమైన ధ్వనులను కావించును
ఆ నది ఇసుకతిన్నెలతో విలసిల్లుచుండెను

కామెంట్‌లు