క్షేమముగా పాలించుచున్నావు గదా?
తప్పు చేయని వారి నుండి శిక్షాధనమును
నీవు తీసుకొని దాచుట లేదు కదా?
అలా చేస్తే నిన్ను ప్రజలు తిరస్కరించెదరు
ప్రజల నుండి సుంకములను పొందుటలేదు గదా?
మంత్రులు మొదలగు ప్రధానాధికారులు
ఉత్తమ వంశమున జన్మించినవారేనా?
నాయనా! నాస్తికులైన బ్రాహ్మణులను
నీ చెంతకు చేరదీయుటలేదు కదా?
వారజ్ఞానులై పండితులుగా భావింతురు
వేదములను, ధర్మశాస్త్రముల నెరుగరు
నాయనా! భరతా! మన కోసల దేశంము
ఆయురారోగ్యములను ఇచ్చు దివ్య భూమి
పంట భూములతో పశుసంపదలతో
విరాజిల్లుచున్న దేశము మన దేశము
ఓ భరతా! నీ అంతపుర స్త్రీలంతా క్షేమమే ,గదా?
వారి రక్షణ భారమును వహించుచున్నావా?
ఆపదలున్న వారిని ఆదుకుంటున్నావా?
రహస్య విషయాలు ఎవరికి తెలుపుటలేదు గాదా?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి