కౌసల్యాదేవి వసిష్టునితో చిత్రకూటమునందలి ఆశ్రమమునకు చేరుట
తీసుకొని శ్రీరాముని దర్శించుటకై
పర్ణశాలప్రదేశమునకు వచ్చుచుండెను.
కౌసల్యాదేవి ముఖము వాడిపోయి యుండెను.
ఓ సుమిత్రా! మన పుత్రులు రామలక్ష్మణులు
ఎన్నడూ ఎవరికి ఏమి హాని చేయలేదు
అట్టివారు రాజ్యము నుండి వెళ్ళగొట్టబడిరి
అనాధలవలె కాలము గడుపు చుండిరి.
నీ కుమారుడు లక్ష్మణుడు రాముని సేవకై
ఎన్నో కష్టములనోర్చుతూ ఈ వనమున
ఆకలి దప్పికలకోర్చి వారికి రక్షణగా ఉంటూ
వారితో పాటు కందములను భుజిస్తున్నాడు
కౌసల్య, సుమిత్రతో గూడి వెళ్తుంటే
ఆ నది తీరమున భూమిపై దర్భలపైన
శ్రీరాముడు పితృ కార్యములపై యుంచిన
గారపిండి పిండములను కౌసల్య జూసి
అప్పుడు ఆమె దశరథ సతులతో ఇలా అంటుంది
సోదరీమణులారా! ఇక్ష్వాకువంశప్రభువైన
మహాత్ముడగు దశరథుని కొరకు ఇచ్చట
శ్రీరాముడు సమర్పించిన పిండములివి దర్శింపుడు .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి