శ్రీరాముని అయోధ్యకు గొనివచ్చుటకై భరతుడు నిండు సభలో ప్రకటించుట
నాయనా! భరతా! మీ తండ్రియగు
దశరథమహారాజు ఎక్కువ కాలము
ఈ కోసలదేశమును పరిపాలించెను
అట్టి ఈ దేశమును దశరథ మహారాజు
నీకు అప్పగించి స్వర్గస్తుడాయెను
శ్రీరాముడు దానిని ఆమోదించినాడు
ఈ రాజ్యము శత్రుభయము లేనిది
వెంటనే రాజ్యాభిషిక్తుడవై పాలించుము
నలుదిక్కులందు యున్న రాజులు,
సముద్ర ద్వీపవాసులైన రాజులు
కోట్లకొలది ధనమును కానుకలుగా నీకిచ్చేదరు
ఓమహర్షి! శ్రీరాముడు బ్రహ్మచర్యనిష్ఠుడు
సకల విద్యలలో ఆరితేరిన వాడు
అట్టి ప్రజ్ఞశాలైన శ్రీరాముని రాజ్యమును
పొందుటకు నేనెట్లు అర్హుడనగుదును
శ్రీరాముని రాజ్యమును నేను స్వీకరించుట
మహా అపచారముగా భావించితిని
ఈ అకృత్యమునకు నేను ఒడిగట్టినచో
నాకు నరకము దప్పదేమో గురువర్యా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి