పసుపు కుంకాలతో పూజలయ్యా!
పాలు పాయసాలు పెట్టేము తండ్రీ
పండ్లు నైవేద్యాలు స్వీకరించు!
పిల్ల పాపలంతా ఆట పాటల మునిగి
చెట్టు పుట్టల మీద చిందు లేసేరు
నీ ఉనికినే మరిచి తిరుగు తుంటారు
ఆద మరిచిన వేళ అమ్మలా కాపాడు!
పసిడి పంటల కొరకు
పగలన రేయనక పంట చేల వెంట
పరుగు పరుగున తిరిగే రైతన్న
గడ్డి నిండిన గట్ల నడిచేటి వేళ...
చెట్టు నీడన సేద దీరు వేళ....
కనిపెట్టి కాపాడు కాలనాగన్న! 🙏🙏🙏
మిత్రులందరికీ నాగ పంచమి శుభాకాంక్షలు💐💐

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి