పండంటి పాప గారు! ఎందుకలా ఉన్నారు!: - డా పివిఎల్ సుబ్బారావు,- విజయనగరం,- 94410 58797.


చక్కని క్రాఫింగ్,
           చెక్కిన చార్మింగ్!
ఏమా లూకింగ్,
                వై ,నో టాకింగ్! 
చిరుపెదవులు బిగింపు ,
    సంపెంగనాసిక సొంపు!
కోపం వచ్చిందా? 
  తెచ్చుకుంటున్నావా! 
కొండమీద కోతి కావాలా,   
    కోరుకో ,తెస్తా ,తీసుకో!

చిట్టి చిలకమ్మా ,
              కోపం చాలమ్మా!
మంత్రం వేస్తానమ్మ,
 పంతం మాయం చేస్తానమ్మా! 
నువ్వు నవ్వాలమ్మా,,
మేము నీకేమి ఇవ్వాలమ్మా!
బంగారు బొమ్మా,,
         మా అమ్మవు కదమ్మా!
నీవేడిస్తే నేను ,
       అసలు చూడలేనమ్మా!

చందమామ తెచ్చి,   
            చేతికిమ్మంటావా!
 తారలను గుచ్చి
మెడలో వేయమంటావా!
 కోపం తెచ్చిన వాడ్ని కాళ్శ, 
ముందు పడేయమంటావా! 
వాడ్ని రెండు తన్ని,
         బుద్ధి చెప్పమంటావా !
నీవిలా ఉంటే ,
       నాకు ఏమీ తోచదమ్మా!

తియ్యని పాట,   
        పాడుకుందామా !
పసందైన ఆట ,
          ఆడుకుందామా!
 జోకులు ,
         వేసుకుందామా !
కేకులు,
     తింటూ ఉందామా!
 పొడుపు కథలు ,
                   చెప్పనా!
 నీ నోరు,
              తెరిపించనా!
 ఒంటిపై ,
     కితకితలు పెట్టనా!
 చెవిలో,
   గుసగుసలు చెప్పనా!
 జోరు జోరుగా,
        మరి, నవ్వించనా!
 మా యాపిల్ పండు ,
       కాస్త నవ్వుతూ ఉండు!
_________

కామెంట్‌లు