నెల తిరిగే సరికి
ఖర్చులన్నీ పోను
చేతిలో చిల్లిగవ్వలేనితనం
సామాజిక అంతస్తుకై
వెంపర్లాటలు
గొర్రె తోక బెత్తెడు జీతం
ఆశమో బారెడు
ఆస్తేమో మూరెడు
వస్తువులను ప్రేమించే వ్యక్తులే
చుట్టూతా
ప్రేమానురాగాలు
మంచి మానవత్వం
నిషేధపు పదాలు
గేటెడ్ కమ్యూనిటీలు
చీమదూరే సందుగూడాలేని
కట్టుదిట్టమైన భద్రత
ఫోనులు
ల్యాప్ టాప్ లు
రిమోట్ లే
నిత్యసహవాసగాళ్ళు
ఎదురుగా ఉన్నోళ్లతో కూడా
మాట్లాడలేని పోష్ కమ్యూనిటీ
ఇవి పాలరాతి భవంతులా కాదు కాదు
ప్రేమ చచ్చిన ప్రేతాత్మలగూళ్ళు
పుట్టుక ఒక్కటే
మరణం ఒక్కటే
నడమంత్రపు సిరితో
నయగారాలు
దూరాలు
అంతరాలు
ఎగుడు దిగుడు
డబ్బు దర్పాలు
అహంతో ఊరేగడాలు
ఎవడైనా రేపు చస్తే
వాడిని శవమనే అంటారు
అందమైన పేరుపెట్టి ఎవడూ పిలవడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి