భరతుడు శ్రీరాముని దర్శనమునకై ఆరాటపడుట
సేనను నిలిపివేసి అతడు కాలినడకతో
అన్న వద్దకెళ్లుటకై నిశ్చయించుకొనెను
భరతుని మాట విని సేన ఆగిపోయెను.
భరతుడు,శత్రఘ్నునితో ఇట్లు నుడివెను
నాయనా! మన వారితో పాటు గుహుని
తోడుగా తీసుకొని వనమంతటను
శ్రీరాముని వెతుకుటకై నీవు వెళ్ళుము.
అన్న శ్రీరాముని, బలశాలయగు లక్ష్మణుని
మహానుభావురాలగు సీతాదేవిని
దర్శించువరకు నా మనస్సు కుదటపడదు
అన్నా!భరతా! నాకు గూడా అట్లనేయుంది.
పురుషశ్రేష్టుడైన భరతుడు కాలినడకన
చిత్రకూటఅరణ్యమున ప్రవేశించెను
కొంత దూరమతడు నడిచిన పిమ్మట
పైకెగిసిన, హోమాగ్నిధూమములను దర్శించెను.
సర్వశుభలక్షణసంపన్నుడైన భరతుడు
జలనిధినుండి ఈదుకుంటూ తీరము చేరెను
చిత్రకూటపర్వతమున ఆశ్రమము జూసి
శత్రఘ్నుని,గుహులతో గూడి ఆశ్రమదిశగా సాగెను.
-----------------------------------------------------------
అయోధ్యకాండమందు 98వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి