మనోహరమైన ఒక పర్ణశాలను చూచెను
ఆ కుటీరము ఆకులతో కప్పబడి యున్నది
ఆ పర్ణశాల లతలుపారి అందముగా యున్నది
ఆ పర్ణశాలగోడకు రెండు సువర్ణ ఖడ్గములు
సూర్యకిరణముల వంటి బాణములు
మెరుయుచున్న రెండు డాలులతో
చిత్రవిచిత్రముగా కనబడుచుండెను.
భరతుడు శ్రీరాముని పర్ణశాల యందునా
పవిత్రమైన విశాలవేదికను గాంచెను.
జటామండలధారియై శ్రీరాముడు సీతా లక్ష్మణులతో
ఆసీనుడైయుండగా భరతుడు దర్శించెను
ధర్మాత్ముడైన ఆ కైకేయిసుతుడు దుఃఖిస్తూ
ముందుకెళ్లి శ్రీరాముని పాదములపై వ్రాలేను
అగ్రజా!నేను ఏ తప్పు చేయలేదు
నన్ను క్షమించి అయోధ్యకు తిరిగి రమ్ము
భరతుడు దుఃఖముతో నేలపై పడిపోయెను
రామలక్ష్మణులు అతడిని లేవనెత్తి ఓదార్చిరి
వీరుల, సూరులవలె వెలుగు చుండిరి.
ఋషీశ్వరులందరు వారిని ఆశీర్వదించురి.
======================================
అయోధ్యకాండమందు 99వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి