గాలిని చీల్చుచు దూకే గుర్రం
నాలుగు కాళ్ళతో గంతులు వేయుచు
కొండలు కోనలు దాటే గుర్రం
ఎర్రని దేహముమెరుపులు మెరుయును
జీనుతో ఉంటే అందం చిందును
రాజుల రథాలు లాగిన గుర్రం
యుద్ధం చేయగ ముందుకు ఉరుకును
ఉడికిన ఉలవలు గబగబ తినును
పరుగులు పెడితే దడదడ లాడును
జట్కా లాగుచు చకచక పరుగులు
గుర్రపు స్వారి భలేగ ఉండును
రాజా అంటే టక్కున వచ్చును
వీపున ఎక్కగ వెంటనె కదులును
కళ్ళెం వేసిన చూచును కసిగా
గమ్యం తృటిలో హాయిగ చేర్చును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి