మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగనిరతి విశ్వంభర వీచికపై చిరస్థాయిగా నిలిచిపోయిందని వికాసతరంగిణి అధ్యక్షులు వాకచర్ల పైడిరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర అను అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమం సారథి విజయ కోదండరామ ఆశ్రమం అధ్యక్షులు టి.టి.వి. రమణమూర్తి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం రమణమూర్తి మాట్లాడుతూ ఇటీవల ఆవిర్భవించిన భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన నేపథ్యంలో వికాసతరంగిణి సంస్థ వ్యాసరచన పోటీలు నిర్వహించడం మిక్కిలి అభినందనీయమని అన్నారు. స్వాతంత్ర్య సముపార్జన సేవలో తరించిన దేశభక్తులను, సమరయోధులను నేటి బాలలు స్మరించుకునేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయని అన్నారు. రాజాంతో పాటు పరిసర ప్రాంతాల్లో గల ఐదు మండలాల పరిధిలో గల 8,9,10 తరగతులకు చెందిన 350మంది విద్యార్ధినీ విద్యార్థులకు నేడు ఈ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, ప్రజ్ఞ అధ్యక్షులు మురపాక గణేష్, యువవికాస్ అధ్యక్షులు గడే అప్పలనాయుడు, వికాస తరంగిణి సభ్యులు గెడ్డాపు శ్రీలక్ష్మి, అమనాన నీలకంఠం, మహంతి సత్యనారాయణ, అబ్బులు, ఉపాధ్యాయులు బూరి అప్పలస్వామి, డి.ఈశ్వరరావు, డోల వాసుదేవరావు పాల్గొన్నారు.
అల్లూరి చరిత్రపై వ్యాసరచన
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి