టీవీలో రెండే రెండు ప్రోగ్రాములని నాకు తెలుసు
ఒకటి సీరియల్స్ రెండు అడ్వర్టైజ్మెంట్స్
అడ్వర్టైజ్మెంట్స్ లో ఓ భాగం
సీరియల్స్ అని కూడా తెలుసు
తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేస్తుంటాం.
వస్తూ
ఉన్నాది ప్రకటన
ప్రేయసి ప్రియుడో
భార్య భర్తో
వాళ్ళిద్దరి కేరింతలుతో తినేశారు 10 నిమిషాలు. ఇంతకీ ఆ వాణిజ్య ప్రకటన దేనికో నాకు ఓ పట్టాన అంతు పట్టలేదు
చివరికి ఆయన ఆవిడకి ఇచ్చాడు
ఒక స్పూను.
అప్పుడు అనిపించింది నాకు ఈ స్పూన్ కోసమా ఎంత టైం! ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ అని.
టీవీలు సినిమాల్లో
పంటి కింద రాళ్లలా, వడగళ్ళ వానలా వాణిజ్య ప్రకటనలు వచ్చి
చంపుతాయి
మన ఉత్సాహాన్ని. వస్తువులు అమ్మకోడానికి
ప్రకటనలు
కావాల్సిందే.
వస్తువు చూపించి దాని విలువ అవసరం వివరిస్తే చాలదా మరి.
ఆ ప్రకటనకు ఓ సినీ యాక్టర్ ఆయనకివ్వాలి
పెద్ద మొత్తం దాంతో జోబు ఖాళీ. ఆ మొత్తం
రాబట్టుకోవడానికి వస్తువు విలువ ఉన్న ధరకన్నా పెరుగుతుంది కొండంత.
ఇదంతా వాణిజ్య ప్రకటనలో అట్టహాసమే అని నా అభిప్రాయం.
ఇది సౌకర్యాల
మిఠాయి చూపించే మాయా ప్రపంచం.
మంచినిమంచిగా వాడుకుంటేనే ఉపయోగం.
లేకపోతే అట్టహాసాల నడుమ నలిగి అధోగతే.
సినిమాల సంగతి ఎట్లున్నా
బుల్లి పెట్టెలో చేరిన ప్రకటనల భూతాలను
తగ్గించకపోతే, దానితోపాటు సీరియల్స్ ను
కాస్త కత్తిరించి తెగించి తగ్గించకపోతే
ఓం నమశ్శివాయ
🙏🏼

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి