కృష్ణుడి అనుకరణ : - యామిజాల జగదీశ్


 బృందావనపు పచ్చని అడవిలో ఆవులను మేపుతున్న సమయంలో, చిన్నారి కృష్ణుడు తన గోపబాలురతో కలసి సరదాగా ఆడుకుంటున్నాడు. ఒక స్నేహితుడు వింతైన ముఖకవళికలు, సైగలు చేస్తూ అందరినీ నవ్వించాడు. కృష్ణుడు కూడా అతనిలాగే చేసి చూపించగా, మిగిలిన సఖులంతా మురిసిపోతూ నవ్వేశారు. చూస్తుండగానే అందరూ ఒకరినొకరు అనుకరిస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. దరిదాపుల్లోనే ఆవులు, దూడలు ప్రశాంతంగా గడ్డి మేస్తున్నాయి. బాలగోపాలుర పసిపాపల ఆనందాలతో బృందావన అందాలు మరింత ప్రేమయంగా మారాయి. ఇది కృష్ణయ్య, ఆయన నేస్తాల అమాయకపు, నిశ్చలమైన బాల్యపు సరదాలను కళ్లకు కట్టింది.
కామెంట్‌లు