అలనాటి హిందీ నటులు!:- సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ


 షేఖ్ ముక్తార్ పేరు మనకి తెలీదుకానీ 1939లో ఏక్ హీ రాస్తా లో నటించాడు.1914లో ఢిల్లీలో పుట్టిన షేఖ్ తండ్రి రైల్వే ఉద్యోగి.6'4" షేఖ్ ని పోలీస్ లేక మిలటరీలో చేర్చాలనుకున్నాడుతండ్రి కానీ అతనుమాత్రం యాక్టర్ కావాలనిఢిల్లీలో నాటకాలేస్తూ కలకత్తా వెళ్లాడు.ఆపై బొంబాయి వెళ్లి రోటీ అనే సినిమాలో సితారాదేవితో కల్సినటించాడు.అది సూపర్ హిట్ ఐంది.ఖైదీ నెంబర్ 911  చిత్రం సూపర్ హిట్! రోటీ సినిమాలో ఓసీన్ ఇది.రైలు ప్లాట్ ఫారం పై ఇస్లామీ చాయ్,హిందూ చాయ్ అని చాయ్ అమ్మేవారు అరవటం మనకు నేడు విచిత్రంగా అనిపిస్తుంది.ఆచాయ్ తయారీ లో,రుచిలో ఏమీ భేదం ఉండదు.ఆనాటి సినిమాలు ఆకాలపుసంస్కృతి సంప్రదాయాలు,భాషను యథాతథంగా చూపేవి.అంతసహజత్వం ఉండేది.హిందూ ముస్లింలంతా ఒకటే అనే సందేశం నటుల నోటితో చెప్పించారు. ఇక షేఖ్ నటుడిగా చంగిజ్ ఖాన్ పాత్ర లో జీవించాడు. 
ఇక ఇంకో హిందీ నటుడు జైపూర్ కిచెందిన అస్రానీ!పూణేలో యాక్టింగ్ లో శిక్షణ పొందిన అతను సినిమాలో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకో  నటుడు మోతీలాల్ ఇలా సలహా ఇచ్చాడు" అస్రానీ! నీవు రాజేంద్ర కుమార్ లా చెప్పాలని ప్రయత్నించకు. ఇతరుల్ని కాపీకొట్టకు.నీ భాషలో స్వంతంగా చెప్పు. నీవు మిమిక్రీ ఆర్టిస్టువి కాదు.నీవేమిటో నిరూపించుకో".షోలే లో జైలర్ పాత్రను అద్భుతంగా పోషించాడు. సలీంజావేద్ అతనికి హిట్లర్ చిత్రం చూపి కొద్దిగా అతని స్పీచ్ కూడా వినిపించాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో విన్న అస్రానీ పై ఆప్రభావం పడింది.అలాగేచార్లీ ఛాప్లిన్ దిగ్రేట్ డిక్టేటర్ ప్రభావంతో అద్భుతమైన నటన తో అస్రానీ ఆకట్టుకున్నాడు. ది బర్నింగ్ ట్రైన్  లో కలిగిన అనుభవంని అస్రానీ ఇలా చెప్పాడు"50మంది నటులు సదా మేకప్ రూంలో పడిగాపులు పడేవారు.నేను రోజూ వెళ్లడం, షాట్ వచ్చినప్పుడు పిలుస్తాం అని సాయంత్రం దాకా కూచోబెట్టేవారు.ఇలా 3రోజులు గడవటంతో  నాల్గవరోజు డుమ్మా కొట్టాను స్టూడియోకి వెళ్లకుండా" అని నవ్వుతూ చెప్పాడు అస్రానీ.సినీరంగం అంత సులువుగా అందుకునే రంగం కాదు సుమా🌹
కామెంట్‌లు