నాగపంచమి .. విశిష్టత : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)- సెయింట్ లూయిస్ - అమెరికా
 

దక్షిణాయన పుణ్యకాలంలో వర్షఋతువులో  శ్రావణమాసపు  పౌర్ణమి ముందు వచ్చే పంచమి నాగపంచమి. ఈ రోజు అతి పవిత్రమైనరోజు
సనాతన సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భరతావని.

      విశ్వంలో ఉన్న ప్రతీ వస్తువు పరమాత్ముని స్వరూపమే అని భావించి ఆరాధి0చడం   భారతీయుల సంస్కృతికి నిదర్శనం .పురాణకథనం ప్రకారం స్థితి కారకుడు శ్రీమహావిష్ణువు శయనించే ఆది శేషువు భక్తి శ్రద్ధలతో చేస్తున్న సేవాతత్పరతకు మెచ్చి విష్ణుమూర్తి నాగులను ఆరాధించడానికి శ్రావణమాసపు శుక్ల పంచమి అనే ప్రత్యేక రోజును  అనుగ్రహించాడు.ఆరోజు నాగపంచమి గా భక్తులు నాగులకు ఆరాధన చేస్తారు 

     తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం ఆచరించి  పూజగదిలో శుభ్రం చేసుకుని ముగ్గును పెట్టీ ఎర్రటి వస్త్రం దానిపై నాగ ప్రతిమనుంచి మొదట విఘ్నేశ్వర పూజ ఆ తరువాత నాగునికి ఆరాధన చేస్తారు పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండి  పాలతో అభిషేకం, ఎర్రటి అక్షింతలు కుంకుమతో పూజించి , చలిమిడి, నువ్వుల చిమ్మిలి, అరటి పండ్లు. , పాయసం నైవేద్యంగా సమర్పించి తరువాత బ్రాహ్మణులకు దాన ధర్మాలు  ఇచ్చి భోజన దక్షిణాది  సత్కారాలతో గౌరవిస్తారు .

      రాహు కేతు ఆరాధన  ఈ రోజు చేస్తే  కాల సర్ప దోష నివారణ జరుగుతుందని   ఆది శంకరులు ఆనాడే చెప్పారు తెలుగు రాష్ట్రంలో  శ్రీకాళహస్తి లో రాహు కేతు ఆరాధన. కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు.
సర్పదోష నివారణకు సంతాన ప్రాప్తికి   ఎంతో ఉపయుక్తం.


నమో అస్తు  సర్ఫేభ్యో యే కే చ పృథివీ మను!

యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్ఫేభ్యో నమః. ,!!

అని సర్ప సూక్తం పఠిస్తే కాలసర్ప దోషం, ఆర్థిక ఇబ్బందులు పోయి సౌభాగ్యం, ఆరోగ్యం కలిగి శతమానం భవతిగా జీవిస్తారని  నడయాడే కంచి పరమాచార్య నాగపంచమి విశిష్టతను వివరించారు...!!
.................................


.
కామెంట్‌లు