పిల్లలకి ప్రపంచాన్ని చూపించడమంటే... చదువు చెప్పే బడి మాత్రమే కాదు.
ఒక చెట్టుని చూపించండి.
“దీనికి ఎన్ని ఏళ్లు ఉంటాయో?“ అని వాళ్లు అడగాలి.
ఒక పిట్టని చూపించండి.
“అది ఎటు వెళ్తుందో?“ అని వారు ఆశ్చర్యపోవాలి.
దూరాన కనిపించే కొండని చూపించండి.
“దానిపైన ఏమంటుందో?“ అని వారు ఊహించుకోవాలి.
ప్రకృతిని ఆస్వాదించడం నేర్పించడమంటే... ఏదో ఒక పాఠం చెప్పడం కాదు, ప్రశ్నించడం నేర్పించడం!
ఈ రోజు ఒక చిన్నారి... ఒక పువ్వుని చూసి ఆగి ఆలోచిస్తే... రేపు ఆ పువ్వు ఉన్న చోటుని కాపాడాలని అనుకుంటుంది.
ఈ రోజు ఒక నది చప్పుడు విని మురిసిపోతే… రేపు ఆ నది ఎండిపోకూడదని అనుకుంటుంది.
మనకి... ఆటవస్తువులు కొనివ్వొచ్చు. కొత్త బట్టలు కొనివ్వొచ్చు. కానీ... ప్రకృతితో గడిపిన ఒక్క రోజు మాత్రం... వాళ్ల మనసులో జీవితాంతం నిలిచిపోతుంది.
అందమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు... ఒక్క ఫోటో తీసుకుని వచ్చేయకుండా... కాసేపు వాళ్లతో కలిసి కూర్చోండి.
అక్కడ ఉండే చెట్లను... గాలిని... పిట్టలను... ఆ ప్రశాంతతను... వాళ్లనే గమనించనివ్వండి.
మన పిల్లలకు మనం ఇచ్చి వెళ్లే అతిపెద్ద ఆస్తి… ఆస్తిపాస్తులో, డబ్బులో కాదు... ఈ ప్రకృతిని ప్రేమించే మంచి మనసు మాత్రమే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి