అతని సాయం: - - యామిజాల జగదీశ్


 అపారమైన డబ్బు ఉన్నవారు లక్షల్లో విరాళమిస్తే అది పెద్ద వార్త అవుతుం  ది. కానీ, ఒక సాధారణ కూలి పని చేసే వ్యక్తి తన కష్టార్జితాన్ని దాచి, ఇతర పిల్లల భవిష్యత్తును మారిస్తే... ఆయన గురించి మాట్లాడుకునే వారు బహు అరుదు.
అంజినేయ యాదవ్ ఒక రోజువారీ కూలీ. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బులో నుంచి 40,000 రూపాయలు దాచుకున్నారు.
ఆ డబ్బును తన సొంత అవసరాలకు వాడుకోకుండా, రోజూ 3 నుంచి 4 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లే పిల్లల కోసం 11 సైకిళ్లు కొనిచ్చారు.
ఇకపై ఆ పిల్లలు ఎండలో, వానలో అంత దూరం నడుచుకుంటూ బడికి వెళ్లాల్సిన అవసరం లేదు.
ఆయన కేవలం 11 సైకిళ్లు మాత్రమే కాదు...11 మంది పిల్లల ప్రయాణాన్ని సులభతరం చేశారు. 11 కుటుంబాల్లో నమ్మకాన్ని నింపారు. తన దగ్గర ఉన్నదాంట్లోనే తోటివారికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 
ఆయన ఒక సాధారణ కూలీ కావడం వల్ల ఈ మంచి పని ప్రపంచానికి పెద్దగా తెలియలేదు.
సమృద్ధిగా ఉన్నవారు సాయం చేయడం గొప్పేమీ కాదు... తన దగ్గర తక్కువ ఉన్నా, ఇతరుల కోసం ఇవ్వడమే నిజమైన మానవత్వం.
ఇతరుల సమస్యను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే, అంజినేయ యాదవ్ పరిష్కారం వైపు నడిచారు.
రాయచూర్‌లోని మల్కండిన్ని గ్రామానికి చెందినతనే అంజినేయ యాదవ్. 
కామెంట్‌లు