ఒక మంచి పుస్తకం : - యామిజాల జగదీశ్
 

 

ఎన్ని ఉన్నా, కొన్ని సంపదలు కంటికి కనిపించవు...
ఇంటి నిండా వస్తువులు ఉంటే అది వసతి.
బ్యాంకులో బోలెడంత డబ్బు ఉంటే అది ఆస్తి.
ఇప్పుడు…
మనసు నిండా మంచి ఆలోచనలు ఉంటే,
అదే అసలైన సంపద.
ఆ సంపదను పెంచుకునే చక్కని మార్గాల్లో ఒకటి — చదవడం. 
ఒక పుస్తకం మీ దగ్గర ఉన్న డబ్బును పెంచకపోవచ్చు…
కానీ, మీ ఆలోచనలను పెంచుతుంది.
మీ పరిజ్ఞానాన్ని విస్తరిస్తుంది.
మీ చూపును, ఆలోచనా మారుస్తుంది.
కొన్నిసార్లు, మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది.
అందుకే పుస్తకం కొనేటప్పుడు “దీనికి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను?” అని మాత్రమే ఆలోచించకండి.
“దీని నుంచి నేను ఏమి నేర్చుకోబోతున్నాను?” అని అడగండి.
ఒక మంచి పుస్తకం — మనసుకు చేసుకొనే దీర్ఘకాలిక పెట్టుబడి.

కామెంట్‌లు