ఆది వాసీలు మన ముత్తాత లకు ముత్తాత లు...! ; - కోరాడ నరసింహా రావు!
 వారు దుంపలు,కాయలు, పండ్ల తో పాటే...

 

వేటకు రాయి, కర్రలను ఆయుధాలుగా మలచుకుని... 
 ఆహారాన్ని సమ కూర్చు కోవటంతో మొదలు పెట్టి... 
   నిప్పును, ఇనుమును కనిపెట్టటంతో... 
  నాగరికతకు బీజం వేసి నారు...! 
  చేతి వృత్తుల నైపుణ్యము. వ్యవ సాయ నేర్పరితనముతో 
 నదీ పరీ వాహక ప్రా0త తములలోసమాజములుగా విలసిల్లి నారు...! 

మనకు ఆద్యులు, పూ జ్యులు వారే...! 
 అట్టి వారిపై చిన్నచూపు   తగునా...!! 
మన పూర్వజులను మనము గౌరవించే తీర వలెను...! 
 
  ఇప్పటికీ  అడవులే ఆవాసములు చేసుకుని 
 వన సంపదలను మనకు అందించు చున్న
 ఆ సహ కారకులను ఎగతాలి చేయక... 
   ఆదరించి అక్కున జేర్చు కుందము...!! 
 ఆది వాసీ దినోత్సవ అభినందనలను తెలియ జేసి కొందము !
జై ఆది వాసీ...! 
  జై జై మా తాత ముత్తా త తాతల ప్రతి రూపాల్లారా ...!! 
        *****

కామెంట్‌లు