...జానపదం మన పల్లెపదం : - అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) - సెయింట్ లూయిస్ - అమెరికా.


జనుల పదమే జాన పదం 
శ్రమను మరచి హృదయ స్పందనతో
అనురాగ ఆప్యాయతలతో 
అసమానతలు లేకుండా అందరు కలసి
ఆనందాల మధ్య  పాడుకునే అపురూప ప్రక్రియ కు ప్రతీక.

అరవై సంవత్సరాల క్రితం అమ్మమ్మ ఊర్లో
నూకలమ్మ జాతరలో
బొజ్జన్న కొండ తీర్థంలో 
కోలాటం డప్పు వాయిద్యం 
పోతురాజు విన్యాసాలు
బుర్రకథ ,హరికథలు 
ఎన్నో ఎన్నెన్నో పంట పొలాల్లో 
ఇల్లు కడుతు రామాయణ,భారతాలను
తమదైన రీతిలో 
అక్షర పరిజ్ఞానమైన లేని  ప్రజలు పాడుకునే పాట
 .
తప్పెటగుళ్ళు ఒగ్గు కథల విభిన్న రూపాలు
ఎంత మథురమో 
నేడు చరవాణి మోజులో 
ఆధునికత అంటు 
జానపదాలు మరుగున పడకుండా 
సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుందాం...!
.............................

కామెంట్‌లు