నా అన్నయైన ఆ శ్రీరామునకు
ఈ రాజ్యమును అప్పగించెదను
ఆయనకు నేను సేవలు చేసేదెను
తండ్రి గారు స్వర్గలోక ప్రాప్తి చెందుటకై
అంత్యసంస్కారములను చేసెదను
నేను త్రికరణ శుద్ధిగా చెప్పుచున్నాను
ఇందు సంశయమునకు తావు లేదు
మహాబలశాలియైన శ్రీరాముని
ఇచ్చటికి రప్పించి రాజ్యమునప్పగించి
నేనే స్వయముగా వణములకు వెళ్ళి
పదునాలుగేళ్ళ వనవాసమును చేసిదను
దుష్ట సంకల్పము గల పాపాత్మురాలా
ఇట్టి పాపాలకు ఒడిగట్టిన దుర్మార్గురాలా
నీవే దండకారణ్యము వెళ్ళుట మంచిది
లేదా అగ్నిలో దూకైన ఉరి వేసుకోనైన మరణింపుము
భరతుడు ఈ విధముగా పలుకుచూ
బాధతో నేలపై పడిపోయెను
అభరాణములన్నియు చెల్లాచెదురాయెను
అతడు మిగుల శోకమున మునిగెను .
===================================
అయోధ్యకాండనందు 74వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి